Tirupati: తిరుపతి ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో నులిపురుగులు, క్షయపై అవగాహన!

Tirupati: తిరుపతి నెహ్రూ నగర్ ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ, క్షయ వ్యాధిపై వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Oct 2026 7:29 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో నులిపురుగులు, క్షయపై అవగాహన!

Tirupati: నెహ్రూ నగర్‌లోని ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల వ్యాధులు, క్షయ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ వ్యాధుల అధికారి డాక్టర్ శైలజ ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా రేణిగుంట మండల పీహెచ్‌సీ హెల్త్ సూపర్వైజర్ కామరాజు మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, భోజనానికి ముందు, మరుగుదొడ్డి వినియోగం తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. నులిపురుగుల నివారణకు ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు డీవార్మింగ్ మాత్రలు తీసుకోవాలన్నారు.

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో క్షయ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి పూర్తిగా నయం చేయగలదని, వైద్యుల సూచన మేరకు చికిత్సను పూర్తికాలం తీసుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో హెడ్మాస్టర్ ముజీబ్, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం సరిత, ఆశా కార్యకర్త, టిబీ సూపర్వైజర్ కళాప్రియ, విద్యార్థులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA