Renigunta: రేణిగుంటలో విషాదం.. అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట తారకరామ నగర్‌లో అప్పుల బాధ తాళలేక ఆటో డ్రైవర్ బద్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Renigunta: రేణిగుంటలో విషాదం.. అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!
రేణిగుంట: అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్‌లో చోటుచేసుకుంది.
వెంకటగిరి మండలం సిద్దవరం గ్రామానికి చెందిన పెయ్యాల బద్రి (26) భార్య కావమ్మ, మూడేళ్ల కుమారుడితో కలిసి తారకరామ నగర్‌లో నివాసముంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా మద్యానికి అలవాటుపడి ఆటో నడపకపోవడంతో అప్పులు పెరిగినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 9న భార్య తన చెల్లెలి ఇంటికి వెళ్లగా, బద్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. శనివారం సాయంత్రం భార్యతో ఫోన్‌లో మాట్లాడిన అతడు, ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఎదురింట్లో నివాసముండే మురళికి సమాచారం అందించారు. అతడు ఇంటికి వెళ్లి చూడగా బద్రి మృతిచెంది ఉన్నట్లు గుర్తించాడు.
మృతుడి తల్లి పెయ్యాల సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.




