Renigunta: రేణిగుంట అభివృద్ధికి అవకాశం కల్పించండి.. అభ్యర్థి కె. చిత్ర!
Renigunta: రేణిగుంట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కె. చిత్ర తెలిపారు. మంచం గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Renigunta: రేణిగుంట అభివృద్ధికి అవకాశం కల్పించండి.. అభ్యర్థి కె. చిత్ర!
Renigunta: రేణిగుంటలో కూటమి ప్రభుత్వం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కె.చిత్ర మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేణిగుంట పట్టణ ప్రజలు తమ అమూల్యమైన ఓటును మంచం గుర్తుపై వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల ఆశీస్సులు,మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రేణిగుంట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.




