Srikalahasti: కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న నాగచైతన్య!
Srikalahasti: కార్తీక మాసం సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య గురువారం శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని, 'వృషకర్మ' విజయం కోసం పూజలు చేశారు.
Srikalahasti: కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న నాగచైతన్య!
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి: కార్తీక మాసం శుభ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగచైతన్య దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో రాహు–కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్న అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
డిసెంబర్ 4వ తేదీన విడుదల కానున్న తన తాజా చిత్రం ‘వృషకర్మ’ అద్భుత విజయం సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్లు నాగచైతన్య తెలిపారు.
దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు హీరో నాగచైతన్యకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.




