Srikalahasti: శ్రీకాళహస్తి గురుకులంలో ఘనంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 77వ స్థాపక దినోత్సవం!

Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 77వ స్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 7 Nov 2026 1:22 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి గురుకులంలో ఘనంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 77వ స్థాపక దినోత్సవం!

Srikalahasti: విద్యార్థులు చదువుతో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరి సేవాభావం, క్రమశిక్షణ అలవర్చుకోవాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లత పిలుపునిచ్చారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 77వ స్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కాసా గార్డెన్‌లోని గురుకుల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్కౌట్స్ వ్యవస్థాపకుడు బేడన్ పావెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతో దోహదపడుతుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

రోవర్ స్కౌట్ లీడర్ టి. రమేష్ బాబు మాట్లాడుతూ స్థానికంగా జరిగే సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. స్కౌట్ మాస్టర్ జి. విజయకుమార్ సంస్థ స్థాపన, లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్లు షేక్ అజారుద్దీన్, శివప్రసాద్, చంగల్ రాయులు, గైడ్ కెప్టెన్ కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI