Tada: వాటెంబెడులో ఘనంగా బొమ్మన సుందరయ్య 18వ వర్ధంతి వేడుకలు!
Tada: తడ మండలం వాటెంబెడులో బొమ్మన సుందరయ్య 18వ వర్ధంతి వేడుకలు, ఏపీ బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, వస్త్రదానం, అన్నదానం నిర్వహించారు.
Tada: వాటెంబెడులో ఘనంగా బొమ్మన సుందరయ్య 18వ వర్ధంతి వేడుకలు!
Tada: తిరుపతి జిల్లా తడ మండలం వాటెంబెడు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి మాజీ కార్యదర్శి, 24 కుప్పాల సంఘం గౌరవ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షులు దివంగత బొమ్మన సుందరయ్య 18వ వర్ధంతి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన కుమారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ మరియు బొమ్మన ఏకాంబరంల ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ మరియు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
సూళ్ళూరుపేటలో ఎంతో ప్రత్యేకాదరణ పొందిన లక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (పిడియాట్రిక్స్, న్యూబోర్న్, చిల్డ్రన్స్ అండ్ ఇఎన్‌టి హాస్పిటల్) సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ P. వీరభద్రయ్య [MBBS, MD (PEDIATRICS), PGPN - BOSTON (USA)] పాల్గొని సుమారు 150 మందికి పైగా గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.
అనంతరం గ్రామంలోని బొమ్మన సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొమ్మన శ్రీధర్, బొమ్మన ఏకాంబరంల చేతుల మీదుగా గ్రామానికి చెందిన వృద్ధులకు, అవసరార్థులకు ఉచితంగా బట్టలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి భోజనాలు స్వీకరించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఉచిత వైద్యం, వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గ్రామ ప్రజలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.




