Tirupati: తిరుపతి MBU ఎంబీఏ విద్యార్థులకు ఘనమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్!

Tirupati: మోహన్ బాబు వర్సిటీ MB3 14 మంది కే12 టెక్నోలో రూ.5.2లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. విజేతలను మంచు మోహన్ బాబు అభినందించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 14 Oct 2026 3:51 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి MBU ఎంబీఏ విద్యార్థులకు ఘనమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్!

Tirupati: తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, ఏ.రంగంపేట సమీపంలో మోహన్ బాబు యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో 2027 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థులు 14 మంది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కే12 టెక్నో సర్వీసెస్ సంస్థలో ఉద్యోగాలు సాధించారు. వీరికి ఏడాదికి రూ.5.2 లక్షల వేతన ప్యాకేజీ లభించిందని కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ వైఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. ఢిల్లీ బాబు తెలిపారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ చాన్సలర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు, ప్రో చాన్సలర్ మంచు విష్ణు, వైస్ చాన్సలర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ సారథి విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ప్లేస్‌మెంట్లకు కృషి చేసిన ప్రొఫెసర్ కె. ఢిల్లీ బాబు, అభినయ్, జీఎం చాణక్య, డా. సోమ సుందర్ రెడ్డిలను ప్రశంసించారు.వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు‌. వృత్తిపరమైన భవిష్యత్తులో వారు విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో, మెరుగైన కెరీర్ అవకాశాలను అందించడంలో మోహన్ బాబు యూనివర్సిటీ నిరంతరం కృషి చేస్తోందని ఈ విజయం మరోసారి నిరూపించింది.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL