Gajulamandyam: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వ్యక్తికి 14 రోజుల జైలు శిక్ష!

Gajulamandyam: గాజులమండ్యం పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 14 రోజుల సాధారణ జైలు శిక్ష విధించిన తిరుపతి ప్రత్యేక జేఎస్‌సీఎం కోర్టు. పోలీసుల హెచ్చరిక.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 Sept 2026 4:41 PM IST
Gajulamandyam
X

Gajulamandyam: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వ్యక్తికి 14 రోజుల జైలు శిక్ష!

Gajulamandyam: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి తిరుపతి ప్రత్యేక జేఎస్‌సీఎం కోర్టు 14 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్‌డీపీవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో, గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసులో దర్యాప్తు జరిగింది.

గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 329/2026, STC నంబర్ 4899/2026 కేసులో మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద ఏ. నవీన్ కుమార్ (26), నగరి మండలం కేజీ కుప్పం గ్రామానికి చెందిన వ్యక్తిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. నిందితుడు కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించడంతో, కోర్టు 24-09-2026 నుంచి 07-10-2026 వరకు 14 రోజుల జైలు శిక్ష విధించింది.

మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాల ముప్పు ఉంటుందని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గాజులమండ్యం పోలీసులు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA