యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈపై సస్పెన్షన్ వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈ సురేశ్ నాయక్ సస్పెన్షన్. విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, ఐఏఎస్ అధికారులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు.

Arun Chilukuri
Published on: 15 Oct 2026 12:27 PM IST
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈపై సస్పెన్షన్ వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
X

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సీఈపై సస్పెన్షన్ వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్లలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ (CE) సురేశ్ నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కోతలు, అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ కఠిన చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి, విధి నిర్వహణలో అలసత్వం వహించారని సీఈ సురేశ్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా సరిగ్గా సాగేలా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఐదుగురు ఏఐఎస్ (AIS) అధికారులను ప్రత్యేక అధికారులుగా/ఇన్‌ఛార్జులుగా నియమించింది.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంతరాయాలపై సీఎస్, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగంలో అలసత్వం వహిస్తే అవసరమైతే ఐఏఎస్‌ అధికారులను సైతం సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని సీఎం గట్టి హెచ్చరిక జారీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.