Telangana: తెలంగాణ రేషన్ డీలర్ల ప్రచార కార్యదర్శిగా గోళ్ల మురళి!
Telangana: తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం ప్రచార కార్యదర్శిగా ఖమ్మం పట్టణానికి చెందిన గోళ్ల మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు.
Telangana: తెలంగాణ రేషన్ డీలర్ల ప్రచార కార్యదర్శిగా గోళ్ల మురళి!
Telangana: తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోళ్ల మురళి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు బుధవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదు లో జరిగిన ముఖ్యల సమావేశంలో రాష్ట్ర రేషన్ డీలర్ల నూతన రాష్ట్ర కమిటీ నిర్మాణంలో భాగంగా ఖమ్మం జిల్లా నుండి ఖమ్మం పట్టణ రేషన్ డీలర్ మాజీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి,
ప్రస్తుత ఖమ్మం పట్టణ కోశాధికారి గా విధులు నిర్వహిస్తున్న గోళ్ళ మురళి ని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.
కమ్యూనిస్టు భావాలు ఉన్న గోళ్ళ మురళి... రాష్ట్ర రేషన్ డీలర్ల వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయనను ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర, ఖమ్మం జిల్లా రేషన్ డీలర్లు ముఖ్య నాయకులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు గోళ్ళ మురళి మాట్లాడుతూ ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాననీ పేర్కొన్నారు..



