Weather Report: వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు!
Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Report: వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు!
Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల రెండు రోజుల పాటు (మంగళ, బుధవారాల్లో) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రానున్న 12 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండగా, ముఖ్యంగా 8 జిల్లాలకు వాతావరణ శాఖ 'అతి భారీ' వర్ష హెచ్చరికలు జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా మరో 20 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ వాయుగుండం ప్రభావం బుధ, గురువారాల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.




