Telangana: 22ఏ నిషేధిత జాబితా నుంచి పేదల భూములను తొలగించాలి

Telangana: 22ఏ నిషేధిత జాబితా నుంచి పేదల భూములు, ఇళ్లకు మినహాయింపు ఇవ్వాలని టీడీపీ నాయకులు పోగులు సైదులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించాలి.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 16 Sept 2026 10:23 PM IST
Telangana
X

Telangana: 22ఏ నిషేధిత జాబితా నుంచి పేదల భూములను తొలగించాలి

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న 22ఏ నిషేధిత జాబితా నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల భూములు ఇళ్లకు మినహాయింపు కలిగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పోగులు సైదులు డిమాండ్ చేశారు. పట్టా భూములు, గతంలో సేల్ డీడ్ అయిన ప్లాట్లు, ఇళ్లను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వం, స్థానిక సంస్థలు రోడ్లు, విద్యుత్, నీరు,

డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రాంతాల్లో 20 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదల ఆస్తులను సైతం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఎన్నో సంవత్సరాలుగా భూమి అనుభవిస్తూ పట్టాదారు భూహక్కుపత్రాలు కలిగివుండి భూములను కూడా 22 చేర్చడం వల్ల పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వెంటనే వాటిని తొలగించే రిజిస్ట్రేషన్ కి అవకాశం కల్పించాలని కోరారు గతంలో రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని సెక్షన్ 22లో నిషేధిత ఆస్తుల జాబితాలో ప్రైవేట్ ఆస్తులను తప్పుగా పరిమితికి మించి చేయాలని మరియు మొత్తం గా చేర్చడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న తీవ్ర అసౌకర్యం మరియు ఇబ్బందులు సెక్షన్ 22-A యొక్క పరిధి మరియు శాసన ఉద్దేశం రికార్డుల సమగ్ర సమీక్ష సవరణ మరియు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారం చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA