TG Inter Exams 2027: ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ ఎగ్జామ్ అంటే?

తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027 తాత్కాలిక టైమ్‌టేబుల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి.

CR Reddy
Published on: 20 Nov 2026 7:03 AM IST
TG Inter Exams 2027: ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ ఎగ్జామ్ అంటే?
X

TG Inter Exams 2027: తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం అందింది. 2027 మార్చిలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. రెండు సంవత్సరాల విద్యార్థుల పూర్తి పరీక్షల వివరాలు తెలుసుకుందాం.

ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి.. ముఖ్యమైన తేదీలు ఇవే

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1 నిర్వహిస్తారు. మార్చి 2న మ్యాథమెటిక్స్-1A, బోటనీ-1, పొలిటికల్ సైన్స్-1, అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు ఉంటాయి. మార్చి 5న మ్యాథమెటిక్స్-1B, జువాలజీ-1, హిస్టరీ-1, కామర్స్ పేపర్-1 నిర్వహిస్తారు.

మార్చి 9న ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 పరీక్షలు జరగనున్నాయి. మార్చి 15న కెమిస్ట్రీ-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1 ఉంటాయి. మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, మ్యాథమెటిక్స్ సింగిల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు. చివరగా మార్చి 19న మోడర్న్ లాంగ్వేజ్-1, జాగ్రఫీ-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్-1 పరీక్షలతో ఫస్టియర్ షెడ్యూల్ పూర్తవుతుంది.

సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి

సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2 నిర్వహిస్తారు. మార్చి 3న మ్యాథమెటిక్స్-2A, బోటనీ-2, పొలిటికల్ సైన్స్-2 పరీక్షలు ఉంటాయి. మార్చి 8న మ్యాథమెటిక్స్-2B, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు నిర్వహిస్తారు.

మార్చి 12న ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2 పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16న కెమిస్ట్రీ-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2 నిర్వహిస్తారు. మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2 పరీక్ష ఉంటుంది. మార్చి 20న మోడర్న్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్-2 పరీక్షలతో సెకండియర్ పరీక్షలు ముగుస్తాయి.

ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే?

సెకండియర్ సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిని రెండు విడతల్లో జరుపుతారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

ఫస్టియర్ సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. వీటిని మూడు విడతల్లో జరపనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్ ఆదివారాల్లో కూడా నిర్వహించనున్నారు.

జనవరిలో ఇతర పరీక్షలు.. ఇంటర్నల్ అసెస్‌మెంట్ తేదీలు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరిలోనూ కొన్ని పరీక్షలు జరగనున్నాయి. జనవరి 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. ఫస్టియర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ జనవరి 29న, సెకండియర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ జనవరి 30న నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు.

ఒకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్

ప్రస్తుతం విడుదలైన తాత్కాలిక థియరీ పరీక్షల తేదీలు జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు వర్తిస్తాయి. అయితే ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల వారీ పూర్తి టైమ్‌టేబుల్‌ను బోర్డు ప్రత్యేకంగా విడుదల చేయనుంది. ఇది ప్రాథమిక షెడ్యూల్ మాత్రమే కావడంతో తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు తుది పరీక్షల షెడ్యూల్, ఇతర తాజా సమాచారం కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.inను పరిశీలించాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.