Padi Kaushik Reddy: వాయిస్ శాంపిల్ వివాదం.. పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్!
Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Padi Kaushik Reddy: వాయిస్ శాంపిల్ వివాదం.. పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్!
Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను (CP) దూషించారనే ఫిర్యాదు మేరకు వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాయిస్ శాంపిల్ ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
పోలీసులు జారీ చేసిన వాయిస్ శాంపిల్ నోటీసులను సవాలు చేస్తూ పాడి కౌశిక్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా.. కేసు దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే పోలీసులు నిబంధనల ప్రకారం వాయిస్ శాంపిల్స్ సేకరిస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం, కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.




