Telangana: తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త సీఎం ప్రజావాణిలో ఆన్లైన్ దరఖాస్తులు!
Telangana: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం సీఎం ప్రజావాణి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Telangana: తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త సీఎం ప్రజావాణిలో ఆన్లైన్ దరఖాస్తులు!
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా సీఎం ప్రజావాణి వెబ్సైట్లో ప్రత్యేక మాడ్యూల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
మాడ్యూల్ అందుబాటులోకి వచ్చిన అనంతరం నెల రోజులపాటు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. ఉద్యమకారులు మీ-సేవ, ప్రజావాణి కేంద్రాల ద్వారా తమ ఆధారాలు, ఉద్యమ సమయంలో నమోదైన కేసుల వివరాలు, సంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత అధికారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి, అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు సమాచారం. అర్హులైన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలకు గుర్తింపు లభించేలా ప్రభుత్వం త్వరితగతిన ప్రక్రియను ప్రారంభించాలని ఉద్యమకారులు ఆశిస్తున్నారు. దరఖాస్తుల ప్రారంభ తేదీ, మార్గదర్శకాలు, అవసరమైన ధ్రువపత్రాలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఉద్యమకారులు వాటిని పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.




