Telangana new pensions 2026: పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Telangana new pensions 2026: తెలంగాణలో కొత్త చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana new pensions 2026: పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Telangana new pensions 2026: తెలంగాణలో కొత్త 'చేయూత' పింఛన్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దరఖాస్తుల పరిశీలన గడువును మరోసారి పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కీలక ఉత్తర్వులు జారీ చేయడం, అర్హులైన లబ్ధిదారుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
నిజానికి క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిపై బాధ్యతల భారం అధికంగా ఉంది. ఒకవైపు ఎస్ఐఆర్ విధులు, మరోవైపు వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లు, ఇతర అత్యవసర అధికారిక బాధ్యతలతో అధికారులు పూర్తిగా బిజీగా గడిపారు. దీనివల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నిర్ణీత గడువులోగా (సెప్టెంబర్ 25 నాటికి) పూర్తి కాలేదు.
అర్హులైన ఏ ఒక్క పేదవాడు కూడా కేవలం గడువు ముగిసిందన్న కారణంతో నష్టపోకూడదనే సదుద్దేశంతో, క్షేత్రస్థాయి అధికారుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం... పరిశీలన గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
సెప్టెంబర్ 30లోగా చేయూత కొత్త పింఛన్ల పరిశీలన ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈ ప్రక్రియలో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే, అర్హులైన ప్రతి లబ్ధిదారుడి ఖాతాలోకి ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్ అందనుంది.




