CV Anand: కర్రెగుట్టల్లోకి పర్యాటకులకు నో ఎంట్రీ.. తెలంగాణ డీజీపీ కీలక ప్రకటన!
CV Anand: కర్రెగుట్టల ప్రాంతంలోకి ఇప్పుడే పర్యాటకులను అనుమతిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
CV Anand: కర్రెగుట్టల్లోకి పర్యాటకులకు నో ఎంట్రీ.. తెలంగాణ డీజీపీ కీలక ప్రకటన!
CV Anand: కర్రెగుట్టల ప్రాంతంలోకి ఇప్పుడే పర్యాటకులను అనుమతిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీ అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కర్రెగుట్టల భద్రతపై కీలక విషయాలు వెల్లడించారు.
కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. అయితే, గతంలో ఆ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వివిధ రకాల మైన్స్, ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన ప్రెషర్ మైన్స్ ఏర్పాటు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అవి ఎక్కడెక్కడ అమర్చారో ఇంకా స్పష్టమైన సమాచారం లేదని పేర్కొన్నారు.
ఇటీవల కొంతమంది మావోయిస్టులను విచారించగా కర్రెగుట్టల పరిధిలో 9 డంప్‌లను గుర్తించినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్యాటకులను లోపలికి అనుమతిస్తే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఆ ప్రాంతంలోని మైన్స్ అన్నింటినీ పూర్తిగా తొలగించి (క్లియర్ చేసి), కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన తర్వాతే పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు.




