Revanth Reddy: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: కరోనా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై నమోదైన కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.
Revanth Reddy: నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: కరోనా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై నమోదైన కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2021 నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి 2021 ఏప్రిల్ 11న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నిర్వహించిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రచార సభలో మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం మరియు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణ ప్రక్రియలో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 313 కింద నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై న్యాయప్రక్రియకు సహకరించారు.




