Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్‌ డిస్మిస్‌!

Danam Nagender: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Arun Chilukuri
Published on: 24 Sept 2026 12:13 PM IST
Danam Nagender
X

Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్‌ డిస్మిస్‌!

Danam Nagender: బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా సమర్థించింది.

పార్టీ ఫిరాయింపులు మరియు అనర్హత వేటు అంశాలకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, ఆయన వాదనలతో ఏకీభవించలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, దానం నాగేందర్ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పుతో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.