Telangana: శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో శాస్త్రోక్తంగా బాల పూజలు!

Telangana: శ్రీ చాముండేశ్వరి పీఠంలో మూలా నక్షత్రం వేళ అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీకృష్ణ మహర్షి శాస్త్రోక్తంగా బాల పూజ చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 18 Oct 2026 12:58 PM IST
Telangana
X

Telangana: శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో శాస్త్రోక్తంగా బాల పూజలు!

Telangana: శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో శరన్నవరాత్రి సందర్భంగా మూలా నక్షత్ర సరస్వతి అమ్మవారి యొక్క అలంకారంలో శ్రీ చాముండేశ్వరి మాత దర్శనం కన్నుల పండుగ జరిగింది.

పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి బాల పూజలు చిన్నారిని శాస్త్రక్తంగా పూజ అభిషేకాదులు నిర్వహించి చిన్నారికి కానుకలు సమర్పించి శుభ ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మాట్లాడుతూ...ప్రస్తుతం బాల పూజలను వికృతంగా., శాస్త్రానికి సమతం కానీ వింత పోకడలతో పూజలు నిర్వహించడం సరైన విధానం కాదని తెలియజేశారు

యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ల వ్యూస్ కోసం భక్తిని వికృత చేష్టలతో ఒకరి కంటే ఒకరు మించిపోయారని..,అసలైన పూజలు నిర్వహించే ఉపాసకులకు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ సందర్భంగా ఆవేదనతో మహర్షి తెలియజేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE