School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఆ జిల్లా విద్యార్థులకు గుడ్ న్యూస్.. కారణమిదే!
School Holiday: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 26న స్కూళ్లు, కాలేజీలకు సెలవు. రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు.
School Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఆ జిల్లా విద్యార్థులకు గుడ్ న్యూస్.. కారణమిదే!
School Holiday: ఆదివాసీ ఆరాధ్య దైవం, నిజాం నిరంకుశ పాలనపై 'జల్, జంగల్, జమీన్' నినాదంతో గర్జించిన మన్యం వీరుడు కుమ్రం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 26న (సోమవారం) విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గిరిజన హక్కులు, స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరవీరుని త్యాగాలను స్మరించుకునేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు.
సెలవు వర్తించని విద్యాసంస్థలు: సాధారణ పాఠశాలలు, కాలేజీలకు సెలవు వర్తించినప్పటికీ, జిల్లాలోని రెసిడెన్షియల్ (ఆశ్రమ/గురుకుల) పాఠశాలలకు మాత్రం ఎలాంటి సెలవు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ విద్యార్థులు యథావిధిగా తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఆ రోజు పనిదినంగా ఆదేశాలు: సోమవారం (అక్టోబర్ 26) ఇచ్చిన సెలవుకు బదులుగా రాబోయే నవంబర్ 14వ తేదీని పనిదినంగా పరిగణించాలని విద్యాశాఖ అధికారులు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
జల్, జంగల్, జమీన్ నినాదకర్తకు నివాళులు:
గోండు ఆదివాసీ సమాజంలో జన్మించి, అడవి బిడ్డల భూములు, అటవీ వనరులపై హక్కుల కోసం నిజాం మూకలపై రాజీలేని పోరాటం చేసిన కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతాలు, పట్టణాల్లో ప్రజలు ఘనంగా నివాళులర్పించనున్నారు. విద్యార్థులు ఆయన పోరాట పటిమను, సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సెలవును అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.




