Rahul Gandhi: ఒకవైపు టిఫిన్.. మరోవైపు తెలంగాణ పాలిటిక్స్‌పై చర్చలు.. రాహుల్ మీటింగ్ హాట్ టాపిక్!
Rahul Gandhi: హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి...
Rahul Gandhi: ఒకవైపు టిఫిన్.. మరోవైపు తెలంగాణ పాలిటిక్స్‌పై చర్చలు.. రాహుల్ మీటింగ్ హాట్ టాపిక్!
Rahul Gandhi: హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నగరంలోని నోవాటెల్ హోటల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలతో కలిసి అల్పాహారం (టిఫిన్) చేస్తూనే రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘భారత్ సమ్మిట్ 2.0’ నిర్వహణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్న ఆయన.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి కావడంతో ఆయనకు నివాళులర్పించే అంశంపై ఈ సమావేశంలో రాహుల్ గాంధీ చర్చించారు. నగరంలో నెహ్రూ విగ్రహం ఎక్కడ ఉందని ఆయన నేతలను అడగగా, ప్రస్తుతం జరగబోయే సభ వేదికకు అది చాలా దూరంలో ఉందని నేతలు బదులిచ్చారు. దీంతో, తాను పాల్గొనబోయే గిగ్ వర్కర్స్ సమావేశ వేదికపైనే జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు.
రాష్ట్ర నేతలతో సమావేశం ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ తన తదుపరి కార్యక్రమాలపై దృష్టి సారించారు. ‘భారత్ సమ్మిట్ 2.0’ సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
విదేశీ ప్రతినిధులతో భేటీ అనంతరం రాహుల్ గాంధీ శిల్పారామం చేరుకుని, అక్కడ గిగ్ వర్కర్స్‌తో కలిసి నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. చివరగా జయభేరి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక పథకాన్ని రాహుల్ గాంధీ ప్రారంభిస్తారు.




