Surabhi Vani Devi: "ఇది గౌరవమా? అవమానమా?".. సోనియాగాంధీ ఆత్మకథపై పీవీ కుమార్తె సురభి వాణీదేవి సంచలన వ్యాఖ్యలు!

Surabhi Vani Devi: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ నేపథ్యంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి స్పందించారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2026 11:17 AM IST
Surabhi Vani Devi
X

Surabhi Vani Devi: "ఇది గౌరవమా? అవమానమా?".. సోనియాగాంధీ ఆత్మకథపై పీవీ కుమార్తె సురభి వాణీదేవి సంచలన వ్యాఖ్యలు!

Surabhi Vani Devi: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో మాజీ ప్రధాని దివంగత పి.వి. నరసింహారావు గురించి ప్రస్తావించిన అంశాలపై పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి స్పందించారు. పీవీపై సోనియాగాంధీకి నిజంగానే గౌరవం ఉంటే, ఆయన అంత్యక్రియలను దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.

సోనియాగాంధీ పుస్తకం విడుదలైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సురభి వాణీదేవి, తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. "సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ను నేను ఇంకా పూర్తిగా చదవలేదు. అయితే, తనకు పీవీతో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని, అలాగే తన అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌గాంధీలకు పీవీ అత్యంత ఆప్తుడని సోనియా ఆ పుస్తకంలో రాసినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నాను" అని వాణీదేవి పేర్కొన్నారు.

పుస్తకంలో రాసిన అంశాలను ప్రస్తావిస్తూ వాణీదేవి పలు ప్రశ్నలు సంధించారు. "కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి ఎనలేని సేవ చేసి, దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన పీవీ నరసింహారావు అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు జరపలేదు? స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఇతర ప్రధానమంత్రికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. దీనిని మేము గౌరవంగా భావించాలా? లేక అవమానమని అనుకోవాలా?" అని సురభి వాణీదేవి నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.