Ghatkesar: ఘట్‌కేసర్ సమీపంలో రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి!
Ghatkesar: ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వందకుపైగా గొర్రెలు మృతి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Ghatkesar: ఘట్‌కేసర్ సమీపంలో రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి!
Ghatkesar: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔషాపూర్ సమీపంలోని కేపాల్ వద్ద సుమారు 3 గంటల సమయం తర్వాత రైలు ఢీకొని 100కుపైగా గొర్రెలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన గొర్రెల యజమానులకు చెందిన గొర్రెలగా గుర్తించారు. గొర్రెల కాపరి మేపుకుంటూ కేపాల్ వద్ద రైల్వే పట్టాల సమీపంలో గొర్రెల కాపరి నిద్రిస్తున్న సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లికి వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు శబ్దానికి గొర్రెలు భయపడి పరుగులు తీశాయని తెలుస్తోంది.
ఈ క్రమంలో అవి రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో రైలు ఢీకొని పెద్ద సంఖ్యలో మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో అక్కడి పరిసరాల్లో విషాద వాతావరణం నెలకొంది.
విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతిచెందిన గొర్రెల సంఖ్య, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల పరిశీలన అనంతరం తెలియాల్సి ఉంది.




