ACB Raids: నిమ్స్ బార్బర్ ఇంట నోట్ల కట్టల గుట్ట.. ఏసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు!
ACB Raids: నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అక్రమాస్తుల కేసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ACB Raids: నిమ్స్ బార్బర్ ఇంట నోట్ల కట్టల గుట్ట.. ఏసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు!
ACB Raids: నిమ్స్ (NIMS) అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం నగరంలో మరోసారి ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
లక్ష్మీభాస్కర్‌కు అనుమానిత బినామీలుగా ఉన్నవారు మరియు పలువురు నిమ్స్ ఉద్యోగుల నివాసాలలో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
నిమ్స్‌లో బార్బర్‌గా పనిచేస్తున్న ధనరాజ్ ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




