Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నాగార్జున ప్రతిజ్ఞ.. కిషన్‌రెడ్డి యాత్రలో టాలీవుడ్ సందడి!
Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో సినీ ప్రముఖులు నాగార్జున, బోయపాటి శ్రీను, సాయికుమార్ పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు చిరంజీవి, శ్రీశ్రీ రవిశంకర్ హాజరవుతారని కిషన్‌రెడ్డి తెలిపారు.
Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నాగార్జున ప్రతిజ్ఞ.. కిషన్‌రెడ్డి యాత్రలో టాలీవుడ్ సందడి!
Nasha Mukt Bharat: మాదకద్రవ్యాల (Drugs) రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర హైదరాబాద్‌లో ఉత్సాహంగా కొనసాగుతోంది. శుక్రవారం మూడో రోజు అమీర్‌పేట నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఫిల్మ్ నగర్ వరకు సాగనుంది. అమీర్‌పేటలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు సాయికుమార్ తదితరులు పాల్గొని యాత్రకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘నషా ముక్త్ భారత్’ కోసం నాగార్జున అక్కడికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. సమాజంలో వస్తున్న ఈ మార్పు చూస్తుంటే ‘నషా ముక్త్ భారత్’ కచ్చితంగా సాధ్యమవుతుందనే బలమైన నమ్మకం ఏర్పడిందన్నారు.
పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్, మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
దేశవ్యాప్తంగా డీఅడిక్షన్ కేంద్రాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా డ్రగ్స్ నిర్మూలన కోసం భారత్ ఇప్పటికే పలు దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, త్వరలోనే అన్ని విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.




