Kamareddy: ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వ ఆర్థిక భరోసా ఎమ్మెల్యే పోచారం

Kamareddy: బాన్సువాడలో 288 మంది లబ్ధిదారులకు రూ.2.80 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.

SALEEM, BANSWADA
Published on: 1 Oct 2026 8:42 AM IST
Kamareddy
X

Kamareddy: ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వ ఆర్థిక భరోసా ఎమ్మెల్యే పోచారం

Kamareddy: షాదీ ముబారక్,కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని వివిధ మండలాల లబ్ధి దారులకు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 240చెక్కులు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 48 చెక్కులను, మొత్తం 288 మందికి 2 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ నివాసం వద్ద పంపిణీ చేశారు.

తెంగాణ ప్రభుత్వం అర్హులైన బీద ప్రజలకు గుర్తించి,వారికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదు అనే భావం తో వారిని ఆర్థికంగా ఆదుకుంటోంది అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్,నసురుల్లాబాద్, పోతంగల్, రుద్రుర్,వర్ని మండలాల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA