Seethakka: దసరా పండుగ కానుకగా కొత్త పెన్షన్లు.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

Seethakka: తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది.

Arun Chilukuri
Published on: 22 Sept 2026 4:08 PM IST
Seethakka
X

Seethakka: దసరా పండుగ కానుకగా కొత్త పెన్షన్లు.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

Seethakka: తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. దసరా పండుగ లోపు కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సెర్ప్ (SERP) సీఈవో దివ్యా దేవరాజన్‌కు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ముఖ్యంగా అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు.

పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అర్హుడికి తప్పుకుండా పెన్షన్ అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి దసరా పండుగ కంటే ముందే కొత్త పెన్షన్ల పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.