Indiramma Towers: రెడ్‌హిల్స్‌లో మరో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి!
Indiramma Towers: హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్‌లో రూ.43.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
Indiramma Towers: రెడ్‌హిల్స్‌లో మరో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి!
Indiramma Towers: హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్‌లో పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రూ.43.20 కోట్ల భారీ నిధులతో, అత్యాధునిక వసతులతో కూడిన 480 ఫ్లాట్లతో ఈ టవర్లను నిర్మించనున్నారు.
నగరంలోని అత్యంత విలువైన ప్రైమ్ ఏరియాలో ఈ టవర్లను నిర్మించి అర్హులైన పేదలకు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. సంబంధిత పరిధిలో మొత్తం నాలుగు విడతల్లో ఇళ్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
త్వరలోనే ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచి, మిగిలిన ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులను కూడా వేగవంతంగా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.




