Karreguttalu: కర్రెగుట్టల్లో ఇంత భారీ డంపా? పోలీసులకే షాకిచ్చిన ఆయుధాల నిల్వ!
Karreguttalu: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Karreguttalu: కర్రెగుట్టల్లో ఇంత భారీ డంపా? పోలీసులకే షాకిచ్చిన ఆయుధాల నిల్వ!
Karreguttalu: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు భద్రతా బలగాలు భారీ షాక్ ఇచ్చాయి. సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులకు సంబంధించిన భారీ ఆయుధ డంప్‌ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఈ డంప్‌ను గుర్తించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి గ్రేహౌండ్స్ బలగాలతో కలిసి పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పూజారి కాంకేర్ వద్ద మావోయిస్టులు రహస్యంగా దాచి ఉంచిన భారీ డంప్ బయటపడింది. స్వాధీనం చేసుకున్న ఈ డంప్‌లో ఏకంగా 300కు పైగా బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించేందుకు చర్ల పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద ఎత్తున బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పెంచామని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ అరుణ్‌కుమార్, సీఐ రాజువర్మ, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ ఏసీ విక్రమ్ రంజన్, ఎస్సై నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




