తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ కొత్త సీపీగా మహేశ్‌ భగవత్‌!

Massive IPS Transfer in Telangana: తెలంగాణలో పరిపాలనాపరమైన మార్పుల్లో భాగంగా ప్రభుత్వం భారీగా ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేసింది.

Arun Chilukuri
Updated on: 12 Nov 2026 5:08 PM IST
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ కొత్త సీపీగా మహేశ్‌ భగవత్‌!
X

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ కొత్త సీపీగా మహేశ్‌ భగవత్‌!

Massive IPS Transfer in Telangana: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేసింది. మొత్తం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) హోదాలో సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలోని కీలక పోలీస్ కమిషనరేట్లు, విభాగాధిపతుల నియామకాల్లో భారీ మార్పులు జరిగాయి.

అధికారుల కొత్త పోస్టింగ్‌ల వివరాలు:

హైదరాబాద్ పోలీస్ కమిషనర్: నగర కొత్త సీపీగా మహేష్ మురళీధర్ భగవత్ నియామకమయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న సీవీ సజ్జనార్ బదిలీ అయ్యారు.

తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ: ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ జనరల్‌గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు.

మహిళా భద్రత & డీజీపీ విభాగం: జైళ్ల శాఖ డీజీగా ఉన్న డాక్టర్ సౌమ్య మిశ్రా బదిలీ కాగా.. డీజీపీ, మహిళా భద్రత విభాగం, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అదనంగా పోలీస్ ఆర్గనైజేషన్, పోలీస్ లీగల్ విభాగాల డీజీపీ బాధ్యతలు కూడా ఆమెకే అప్పగించారు.

జైళ్ల శాఖ డీజీ: ఇప్పటివరకు హోంగార్డ్స్ డీజీపీగా ఉన్న స్వాతి లక్రాను జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డీజీగా నియమించారు.మెూత్తం హోంగార్డ్స్ డీజీపీగానూ ఆమె అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఏసీబీ & సీఐడీ: యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా చారు సిన్హా నియమితులయ్యారు. ఆమెకు సీఐడీ డీజీపీగా అదనపు బాధ్యతలు దక్కాయి.

టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ: ఆర్టీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్ నియామకం జరిగిసది.

గ్రేహౌండ్స్ & ఆక్టోపస్: గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలతో పాటు అదనపు డీజీపీగానూ ఆయన కొనసాగుతారు.

సివిల్ సప్లైస్ కమిషనర్: వై. నాగిరెడ్డి నియామకం.

ట్రాఫిక్ & రోడ్ సేఫ్టీ: తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు.

శాంతిభద్రతలు (L&O): అదనపు డీజీపీ (L&O)గా ఆకున్ సబర్వాల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ట్రైనింగ్ విభాగం: అదనపు డీజీపీగా సంజయ్ కుమార్ జైన్‌కు ట్రైనింగ్ బాధ్యతలు అప్పగించారు.

ఐజీ, డీఐజీ స్థాయి అధికారుల మార్పులు:

ఎస్. చంద్రశేఖర్ రెడ్డి - ఏసీబీ ఐజీ

కార్తికేయ - ఇంటెలిజెన్స్ ఐజీ

కే. రమేష్ నాయుడు - రైల్వే ఐజీ

డి. జోయల్ డేవిస్ - రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాల జాయింట్ డైరెక్టర్

ఆర్. భాస్కరణ్ - డీఐజీ ఇంటెలిజెన్స్ (అదనపు బాధ్యతలు)

కే. నారాయణ నాయక్ - డీఐజీ జోన్-2 బాసర

ఎల్.ఎస్. చౌహాన్ - డీఐజీ కోఆర్డినేషన్

చందనా దీప్తి - డీఐజీ జోన్-8 జోగులాంబ (అదనపు బాధ్యతలు)

శ్రీ బాలాదేవి - డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), టీజీ-టీఎంఏఆర్ఎస్

వి. అరవింద బాబు - హైదరాబాద్ సిటీ డీసీపీ (SM&IT)

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.