జవహర్‌నగర్‌లో అగ్నిప్రమాదం: ఇల్లు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాధితులు!

Fire Accident: మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల శ్రీరామ్ నగర్ కాలనీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 25 March 2026 5:25 PM IST
జవహర్‌నగర్‌లో అగ్నిప్రమాదం: ఇల్లు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాధితులు!
X

జవహర్‌నగర్‌లో అగ్నిప్రమాదం: ఇల్లు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ బాధితులు!

Fire Accident: మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల శ్రీరామ్ నగర్ కాలనీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీకి చెందిన భైరవ చారి, స్వప్న దంపతుల నివాసంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

బాధితుల నివాసంలో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఇల్లంతా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ఇతర గృహోపకరణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద కుటుంబం కావడంతో సామాగ్రి మొత్తం కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఒకవేళ ఎవరైనా లోపల ఉండి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక కాలనీ వాసులు కోరుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story