KTR: ఇటీవల విన్న బెస్ట్ జోక్ ఇదే.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు!
KTR: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
KTR: ఇటీవల విన్న బెస్ట్ జోక్ ఇదే.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు!
KTR: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నగరంలో తాగునీటి సమస్య లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడంపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. ‘‘ఇటీవల కాలంలో నేను విన్న అత్యుత్తమ జోక్ ఇది. కాంగ్రెస్ జోకర్లను ఎన్నుకుంటే.. సర్కస్ చూడాల్సిందే’’ అని కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
నగరంలో నీటి సరఫరా పరిస్థితులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటనకు కౌంటర్‌గా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.




