KTR: రేవంత్ రెడ్డి అహంకారంతోనే నీళ్లు ఎత్తిపోయలేదు: మూసీ సుందరీకరణపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్!
KTR: రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఉందా అని ప్రశ్నించిన కేటీఆర్. మూసీ సుందరీకరణ, రేవంత్ రెడ్డి పాలన, రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర విమర్శలు.
KTR: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడుతుంటే, మరోవైపు డీపీఆర్ కూడా లేకుండా మూసీ సుందరీకరణ పేరిట వేలాది ఎకరాల భూములను లూటీ చేయడానికి కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
"రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తోందా? మూసీ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్‌లో పబ్లికే లేరు.. ప్రజలను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రజలు ఆలోచించాలి" అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, వేలాది ఎకరాల దోపిడీ కనిపించడం లేదా? ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు చూడకుండా ఇదేనా మీ ఆలోచన? అని ప్రశ్నించారు.
"హైదరాబాద్‌లోనే తాగునీరు లేని పరిస్థితి ఉంటే.. మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తెచ్చి మూసీలో పోస్తామనడం హాస్యాస్పదం. డీపీఆర్ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బయటపెట్టాలి" అని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరువు లేదు కానీ, సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతోనే నీళ్లు ఎత్తిపోయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే మేడిగడ్డ పిల్లర్ కింద బాంబు పెట్టి పేల్చి మూడేళ్లు దాటుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.




