KTR: పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: ప్రజలు పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ బయటకు రాకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2026 5:18 PM IST
KTR: పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
X

పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి.. ప్రజలు తన్నే దున్నపోతును తెచ్చుకున్నారంటూ తీవ్ర పదజాలంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

పని చేస్తున్న ప్రభుత్వం కాళ్లల్లో కట్టెలు పెట్టకూడదనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రస్తుతం బయటికి రావట్లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. గడిచిన మూడేళ్లుగా కేసీఆర్‌ బహిరంగంగా కనిపించకపోయినా.. ప్రజల్లో ఆయనపై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. ఆయన ప్రత్యక్షంగా కనిపించకపోయినా ప్రతి ఒక్కరి గుండెల్లో భద్రంగా ఉన్నారని, ముఖ్యంగా ప్రతి మహిళా, ప్రతి ఆడబిడ్డ ఇవాళ కేసీఆర్‌ పాలనను తలచుకుంటున్నారని తెలిపారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సీజన్‌లోనూ సమయానికి రైతుబంధు పడేదని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మూడు సీజన్లకు సంబంధించి 'రైతుభరోసా'ను ఎగ్గొట్టిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.