Metpally: పట్టణ సమస్యలపై ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ మహాధర్నా

Metpally: మెట్టుపల్లి పట్టణ ప్రజల మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసమే బీజేపీ పోరాడుతుందని పట్టణ అధ్యక్షులు నవీన్ వెల్లడి; ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా.

Sirisha
Published on: 1 Oct 2026 2:28 PM IST
Metpally
X

Metpally: పట్టణ సమస్యలపై ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ మహాధర్నా

Metpally: మెట్టుపల్లి పట్టణ ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక పాలకవర్గం, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ మెట్టుపల్లి పట్టణ అధ్యక్షులు దొనికెల నవీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టణ ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ప్రధాన ప్రజా సమస్యలపై ఆర్డీవో కార్యాలయం ముందు భారీ "మహాధర్నా" కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దొనికెల నవీన్ మాట్లాడుతూ, పట్టణంలో తక్షణమే పరిష్కరించాల్సిన పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు

మెట్టుపల్లి పట్టణంలోని ప్రతి వార్డులోనూ నాణ్యమైన సీసీ రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజీల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి.

వ్యాపారులు, ప్రజల సౌలభ్యం కోసం పెండింగ్‌లో ఉన్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి.

పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలను ఆధునీకరించి, అన్ని వసతులతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రయాణికుల సౌలభ్యం కోసం పాత బస్టాండ్, డిపో మరియు ఆరపేట పరిసర ప్రాంతాలలో నూతన బస్సు షెల్టర్లను నిర్మించాలి.

జాతీయ రహదారి వెంబడి వర్షపు నీరు నిలవకుండా పక్కా డ్రైనేజీలను నిర్మించి ప్రజల ఇబ్బందులు తొలగించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకుండా, మిషన్ భగీరథ ద్వారా పూర్తిగా శుద్ధి చేసిన తాగునీటిని మాత్రమే నిరంతరం సరఫరా చేయాలి.

అద్దె భవనాలలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి . వచ్చే దసరా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మెట్టుపల్లి పట్టణంలో ప్రత్యేక సుందరీకరణ చర్యలు, విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలి.

ప్రజల ప్రాథమిక హక్కులైన ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

పట్టణ ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఈ మహాధర్నా కార్యక్రమంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు,

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనుప్ రావు మెట్టుపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి జుంగుల అనిల్ గౌడ్ బత్తుల జగదీష్ కలికోట శ్రీకాంత్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ వాయిస్ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్ పట్టణ ఉపాధ్యక్షులు

భోగ దత్తు గుంటుక సదాశివ్ ఐటీ సెల్ కన్వీనర్ పాస్ కంటి శ్రీనివాస్ మిట్టపల్లి కృష్ణమూర్తి నూనె క్రాంతి పూడు కారపు కిషోర్ రెడ్డి ఓ బి సి మోర్చా అధ్యక్షులు శంకు ప్రసాద్ కలాలి రాజిరెడ్డి తిరుసుల్లా అర్జున్ సుంకే అశోక్ తోకల సత్యనారాయణ

అంబాల జగన్ తల్లోజి భాస్కర్ గుండు మోహన్ పారి పెళ్లి గంగాధర్ సుధా వేణి మహేష్ దండిగ నరసయ్య మొగిలి పాక హరికృష్ణ నేమూరి వరలక్ష్మి కళ్యాణి బీజేవైఎం అధ్యక్షులు గోపనవేని రమేష్ యాదవ్ శంభోజి వివేక్ పాల్గొన్నారు.

Sirisha

Sirisha