Kamareddy: దుర్కిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Kamareddy: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కిలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు; రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.
Kamareddy: దుర్కిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Kamareddy: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కిసాహకార సంఘం ఆధ్వర్యం లో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సొసైటీ అధ్యక్షుడు దివిటీ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని సొసైటీ ల ఆధ్వర్యం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంబాలు జరుగుతున్నట్లు వారు తెలిపారు.
రైతులు దళారులకు అమ్ముకుని మోసపోవద్దని సూచించారు.A గ్రేడ్ కు 2461/-,B గ్రేడ్ కు 2441/- ధర చెల్లిస్తున్నామని,రైతులకు ధాన్యం డబ్బులు దాకా లేకుండా,వారం లోపు తమ ఖాతాలో జమ అవుతాయని,శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమా నారాగౌడ్,సహకార సంఘం డైరెక్టర్లు పురం శ్రీనివాస్,మిద్దెల రాములు,దివిటీ రాజు యాదవ్,కార్యదర్శి పీ సుధాకర్,వ్యవసాయ విస్తరణ అధికారిని సాయి సుమన్,గ్రామ రైతులు పాల్గొన్నారు.




