Kavitha: అటు సీఎం రేవంత్.. ఇటు కేటీఆర్: ప్రెస్ మీట్‌లో విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత!

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు. ఎల్‌నినో హెచ్చరికలు పట్టించుకోలేదని, పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం.

Arun Chilukuri
Published on: 16 Oct 2026 3:50 PM IST
Kavitha
X

Kavitha: అటు సీఎం రేవంత్.. ఇటు కేటీఆర్: ప్రెస్ మీట్‌లో విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత!

Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎల్‌నినో ప్రభావంపై 10 నెలల ముందు నుంచే స్పష్టమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిందని, ఇప్పుడేమో పంటలు వేయొద్దంటూ రైతులను కోరడం ఏంటని ఆక్షేపించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా.. నేటికీ ప్రజా సమస్యల పరిష్కారాన్ని వదిలేసి, పాత ప్రభుత్వాన్నే తిడుతూ కాలక్షేపం చేస్తోందని దుయ్యబట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు)లో పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథను సరిగ్గా నిర్వహించి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి అసలు మరమ్మతులు చేపడతారా లేక పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే గడిపేస్తారా అని ప్రశ్నించారు.

తోడబుట్టిన వారిని కూడా కిరాయి మనుషులతో తిట్టించే స్వభావం కేటీఆర్‌దని మండిపడ్డారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మోటార్లతో నీటిని తరలిస్తున్నారో లేదో తెలియదు కానీ, పలువురు ఎమ్మెల్యేల పొలాలకు మోటార్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.