Hyderabad: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి: ఇండీ కూటమి ఆధ్వర్యంలో 'చలో లోక్‌భవన్' నిరసన
Hyderabad: ఎస్‌ఏఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Hyderabad: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి: ఇండీ కూటమి ఆధ్వర్యంలో 'చలో లోక్‌భవన్' నిరసన
Hyderabad: సర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు నిరసనగా 'సేవ్ డెమోక్రసీ' (Save Democracy) పేరుతో ఇండీ (INDIA) కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ఆందోళన నిర్వహించారు.
నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ లోక్‌భవన్ వరకు కొనసాగింది. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ప్రత్యక్షంగా పాల్గొని నాయకత్వం వహించారు.
కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




