hmtv Business Excellence Awards 2026: హైదరాబాద్‌లో వ్యాపార దిగ్గజాల సమ్మేళనం.. నేడే హెచ్‌ఎమ్‌టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026!

hmtv Business Excellence Awards 2026: హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో హెచ్‌ఎమ్‌టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026.

Arun Chilukuri
Published on: 4 Nov 2026 1:31 PM IST
hmtv Business Excellence Awards 2026
X

hmtv Business Excellence Awards 2026: హైదరాబాద్‌లో వ్యాపార దిగ్గజాల సమ్మేళనం.. నేడే హెచ్‌ఎమ్‌టీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026!

hmtv Business Excellence Awards 2026: హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ హాల్ లో ఇవాళ hmtv ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్-2026 కార్యక్రమం జరగనుంది. వ్యాపార రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ కార్యక్రమంలో బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ని ప్రధానం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో నాలుగు సెషన్స్ ఉంటాయి.

తొలి సెషన్ లో హాకథాన్ కార్యక్రమం ఉంటుంది. ఇంజనీరింగ్ అద్భుతప్రతిభ చాటుతున్న టాప్-20 టీమ్స్ తో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సెషన్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హవర్ కొనసాగనుంది. ఆ తర్వాత స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ అవర్ కొనసాగుతుంది. ఇది టాలెంటెడ్ విద్యార్థులకు, కంపెనీలకు మధ్య ఈ కార్యక్రమాలు వారధిలా నిలవనున్నాయి.

చివరి సెషన్ 6.30 నిమిషాల నుంచి ప్రారంభకానుంది. ప్రతిష్టాత్మకమైన బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డు కార్యక్రమానికి ఎందరో అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 28 మందికి బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులు.. విశిష్ట సేవలందించిన మరో ఇద్దరికి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ ఫిల్మ్ హీరో సత్యదేవ్ కంచరాన తదితరులు హాజరుకానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.