Heavy Rains: రాబోయే 24 గంటల్లో తెలంగాణలో కుంభవృష్టి..స్కూళ్లకు సెలవు!
Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, వినాయక నిమజ్జన రద్దీ కారణంగా తెలంగాణ, ఏపీలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Heavy Rains: రాబోయే 24 గంటల్లో తెలంగాణలో కుంభవృష్టి..స్కూళ్లకు సెలవు!
Schools closed: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణను నల్లని మేఘాలు ఆవహించగా, ఉత్తరాంధ్రలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో వినాయక నిమజ్జనోత్సవాల కోలాహలం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
రాగల రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా భారీ జనసంచారం, ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు.
నేడు ప్రకటించిన సెలవుకు బదులుగా.. వచ్చే నవంబర్ 14న రెండో శనివారం అయినప్పటికీ పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాలు, నిమజ్జన రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికార వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.




