Harish Rao: రేవంత్‌రెడ్డి హయాంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా?
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
Harish Rao: రేవంత్‌రెడ్డి హయాంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా?
Harish Rao: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్ అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను ఎంత కాలం నడిపారో ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన జీవో నంబర్ తప్పని హరీశ్‌రావు ఆరోపించారు. అంతేకాకుండా, ఒంగోలు బ్రాంచ్ కెనాల్ అని ఉండాల్సిన చోట సీఎం నాగార్జున సాగర్ కెనాల్ అని తప్పుగా పేర్కొన్నారని విమర్శించారు.
కృష్ణా జలాల సాధన, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తుచేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరును హరీశ్‌రావు ఎండగట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే...
30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారని, కానీ బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక పాలమూరులో అదనంగా లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా? అని నిలదీశారు.
2024 డిసెంబర్ 3న ఏపీ ప్రభుత్వం 403, 405 జీవోల ద్వారా కుప్పానికి లైనింగ్ పనులు చేయించిందని ప్రస్తావించిన హరీశ్‌రావు.. 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు కృష్ణా జలాలు పారుతుంటే, ఇక్కడే ఉన్న పాలమూరుకు మాత్రం నీళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కుల కోసం, కృష్ణా జలాల వాటా (సెక్షన్ 3) కోసం పోరాడింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. టీఆర్ఎస్ పుట్టకముందు నీళ్ల గురించి ఎవరైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో సాగర్ కుడి కాల్వకు ఒక నీతి, ఎడమ కాల్వకు మరో నీతి ఉండేదని, జూరాల, మెదక్ జిల్లాల్లో ఆయకట్టు పెరిగిందంటే అది కేసీఆర్ వల్లేనని పేర్కొన్నారు.
పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నేతలేనని హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాడుతున్నప్పుడు రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నిస్తూ, ఉద్యమ సమయంలోనూ, ఇప్పుడు సీఎంగానూ రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.




