Erravalli Land Survey: ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. నేడు ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్!
Erravalli Land Survey:సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం. కలెక్టర్ హైమావతి ప్రభుత్వానికి నేడు అందజేత. సర్వే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ.
Erravalli Land Survey: ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. నేడు ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్!
Siddipet: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూసర్వే నివేదిక దాదాపు సిద్ధమైంది. సర్వే నిర్వహించిన రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ హైమావతికి నివేదిక అందింది. ఈ నివేదికను నేడు కలెక్టర్ ప్రభుత్వానికి అందజేయనుండటంతో, ఇందులో ఏయే అంశాలు వెలుగులోకి వస్తాయనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎర్రవల్లిలో భూములు అన్యాక్రాంతం అయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ సర్వే ప్రక్రియను ప్రారంభించారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ప్రభుత్వ భూములున్న సర్వే నంబరు 325లో అధికారులు హద్దులను నిర్ధారించి, రైతులకు నోటీసులు ఇచ్చి సర్వే పూర్తి చేశారు.
తమకు చెందిన భూములు సైతం 2014లో 325 సర్వే నంబరులో కలిపేశారని, తమకు న్యాయం చేయాలని శివారు వెంకటాపూర్ గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో పాటు మంత్రి పొంగులేటిని కలిసి తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ సర్వే నివేదికలో సదరు గ్రామస్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం అందడంతో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత దీనిపై పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.




