KCR: కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై దృష్టిసారించిన రెవెన్యూ యంత్రాంగం.. వివరాలు సేకరిస్తున్న అధికారులు!

KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం భూముల వివరాలపై రెవెన్యూ అధికారుల కసరత్తు.

Arun Chilukuri
Published on: 17 Sept 2026 5:17 PM IST
KCR
X

KCR: కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై దృష్టిసారించిన రెవెన్యూ యంత్రాంగం.. వివరాలు సేకరిస్తున్న అధికారులు!

KCR: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు, గతంలో ఆ భూములు కలిగి ఉన్న రైతుల పేర్లు, ప్రస్తుత రికార్డులను సేకరించి ప్రత్యేక నివేదిక రూపంలో అధికారులు తయారు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, రెవెన్యూ యంత్రాంగం ఈ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అసెంబ్లీలో జరిగిన చర్చల అనుగుణంగా కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములకు సంబంధించి పూర్తి స్థాయి నిజానిజాలను వెలికితీసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. ప్రభుత్వ భూములు ఏమైనా దీని పరిధిలో ఉన్నాయా అనే కోణంలోనూ, రికార్డుల్లో ఉన్న పేర్ల ఆధారంగా పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.