El Nino: రైతులకు ఉచిత కూరగాయల విత్తన కిట్లు పంపిణీ

El Nino: ఎల్ నినో ప్రభావంతో యాసంగిలో వర్షాభావ సూచనలు. వరి మానేసి కూరగాయలు సాగుచేసే రైతులకు ఉద్యానవన శాఖ ఉచితంగా రూ.1000 విలువై విత్తన కిట్లు పంపిణీ.

RAJU, PEDDAPALLI
Published on: 5 Nov 2026 4:08 PM IST
El Nino
X

El Nino: రైతులకు ఉచిత కూరగాయల విత్తన కిట్లు పంపిణీ

El Nino: ఎల్ నినో ప్రభావంతో రానున్న యాసంగి 2026-27లో వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యానవన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడుతూ... యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని, సాగునీటి ప్రాజెక్టుల నుండి తాగునీటికే ప్రాధాన్యత ఉంటుందని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంట ప్రణాళిక వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోందన్నారు. రైతులు భూములను బీడుగా ఉంచకుండా తక్కువ నీటితో సాగయ్యే కూరగాయ పంటలు వేయాలని కోరారు.

రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కూరగాయ విత్తన కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కిట్ లో 7 రకాల విత్తనాలు ఉంటాయని, 10 గుంటల్లో సాగుకు సరిపోతాయని, ఒక్కో కిట్ విలువ రూ.1000 ఉంటుందన్నారు. ఆసక్తి గల రైతులు మండల ఉద్యానవన అధికారులను సంప్రదించాలని కోరారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI