Danam Nagender: ఖైరతాబాద్ ఉపఎన్నిక నిర్వహించవద్దు.. హైకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్!
Danam Nagender: ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్. ఎన్నికల పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున లంచ్ మోషన్ దాఖలు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణ.
Danam Nagender: ఖైరతాబాద్ ఉపఎన్నిక నిర్వహించవద్దు.. హైకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్!
Danam Nagender: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగబోయే ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల నిర్వహణను ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరుతూ దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తన ఎన్నికకు సంబంధించిన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, ఈ తరుణంలో ఉపఎన్నికలను నిర్వహించడం సరికాదని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.




