Revanth Reddy: నెహ్రూ వేసిన పునాదుల వల్లే దేశంలో విద్యా, నీటిపారుదల రంగాలు అభివృద్ధి
Revanth Reddy: మైనార్టీలకు తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy: నెహ్రూ వేసిన పునాదుల వల్లే దేశంలో విద్యా, నీటిపారుదల రంగాలు అభివృద్ధి
Revanth Reddy: దేశంలో విద్య మరియు నీటిపారుదల రంగాలకు తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్ కొనియాడారు. నాడు ఆయన వేసిన పటిష్టమైన పునాదుల వల్లే నేడు ఆ రెండు రంగాల్లో దేశం అద్భుతమైన వృద్ధిని సాధించిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఐఐటీలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని.. ఆనాడు పడిన పునాదుల వల్లే నేడు భారతీయులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు సీఈవోలుగా ఎగుగలుగుతున్నారని తెలిపారు.
ప్రస్తుత కాలానికి తగినట్లుగా కంపెనీల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు యువతలో పెరగాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే ఐటీఐలను ఏటీసీలుగా మారామని, మరింత ఆధునిక వసతులతో 'స్కిల్ యూనివర్సిటీ'ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధస్సు (AI) కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలకు కొంత ముప్పు వాటిల్లినా, టెక్నాలజీ ఎంత పెరిగినా బ్లూ కాలರ್ జాబ్‌లకు ఎప్పటికీ ముప్పు ఉండదని స్పష్టం చేశారు.
మైనార్టీ విద్యార్థులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని, అయితే బీజేపీ మాత్రం మైనార్టీలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లపై కూడా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. క్రికెట్‌లో రాణిస్తున్న హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని గుర్తుచేశారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్‌లకు పార్టీ టికెట్లు ఇచ్చామని, ఎన్నికల్లో విజయం దక్కనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర అభివృద్దిలో భాగంగా మీరాలం చెరువుపై రూ.600 కోట్లతో కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, దీనిని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మూసీ నదిలో ఆక్రమణలను తొలగించి సుందరీకరణ చేపడుతున్నామని.. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే పాతబస్తీని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారని, నగరంలో 'నైట్ ఎకానమీ' గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.




