Revanth Reddy: పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
Revanth Reddy: హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Revanth Reddy: పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
Revanth Reddy: రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రాధాన్య రంగంగా గుర్తిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రంగానికి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC)లో నిర్వహించిన ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు వేగంగా, సులభంగా మంజూరు చేసేందుకు త్వరలోనే సింగిల్ విండో విధానాన్ని తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు.
పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న దాణా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ అంశంపై 48 గంటల్లోగా సమీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ వేదికగా గత 18 ఏళ్లుగా పౌల్ట్రీ మీట్‌ను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని సీఎం ప్రశంసించారు.
ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు అందిస్తే ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.




