Chicken Price: పండగ వేళ నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
Chicken Price: పండుగ సమయం దగ్గర పడుతుండటంతో నాన్‌వెజ్ ప్రియులకు ఊహించని షాక్ తగులుతోంది.
Chicken Price: పండుగ సమయం దగ్గర పడుతుండటంతో నాన్‌వెజ్ ప్రియులకు ఊహించని షాక్ తగులుతోంది. మార్కెట్‌లో చికెన్ ధరలు ఒక్కసారిగా దూసుకుపోతున్నాయి. మొన్నటి వరకు సాధారణ ధరల వద్ద లభించిన మాంసం ఇప్పుడు అకస్మాత్తుగా ప్రిమైంది. పండుగ రోజుల్లో చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల వ్యాపారులు ధరలను ఇష్టానుసారంగా మారుస్తున్నారు. నిత్యావసర సరుకుల భారం ఇప్పటికే మోస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఈ ధరల పెరుగుదల మరింత నిరాశను మిగులుస్తోంది.
వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న లేటెస్ట్ రేట్లు
ప్రస్తుతం హైదరాబాద్ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.261 ఉండగా, డ్రెస్డ్ చికెన్ ధర రూ.231 వద్ద ఉంది. అలాగే రిటైల్ లైవ్ బర్డ్ రూ.149 పలుకుతుండగా, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.122 దాకా ఉంది. కరీంనగర్ ప్రాంతంలో కూడా దాదాపు ఇవే ధరలు కనిపిస్తున్నాయి. ఇక విజయవాడ జోన్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.275 ఉండగా, డ్రెస్డ్ చికెన్ రూ.243 వరకు అమ్ముతున్నారు. రిటైల్ మార్కెట్‌లో లైవ్ బర్డ్ రూ.157 గా ఉంది. కొన్ని ప్రాంతాలలో అయితే డిమాండ్‌ను బట్టి కిలో చికెన్ ఏకంగా రూ.300 వరకు పలుకుతోంది.
కోడిగుడ్ల ధరల్లోనూ పెరుగుదల
చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. విజయవాడ జోన్‌లో పన్నెండు గుడ్ల రిటైల్ ధర రూ.80 దాటగా, హైదరాబాద్ అలాగే కరీంనగర్ జోన్లలో పన్నెండు గుడ్ల ధర రూ.76 వద్ద కొనసాగుతోంది. పండుగ పూట ఇళ్లలో ప్రత్యేక వంటకాలు చేసుకునేందుకు గుడ్లు, చికెన్ తప్పనిసరి కావడంతో ప్రజలు ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో పండుగ హడావుడి మరింత పెరిగితే ధరలు ఇంకా ఎగిసే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.




