Pargi: రాష్ట్రవ్యాప్తంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు!
Pargi: తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న 174వ జయంతిని అక్టోబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని పరిగిలో నేతలు పిలుపునిచ్చారు.
Pargi: రాష్ట్రవ్యాప్తంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు!
Pargi: తెలంగాణ రాబిన్హుడ్గా, సామాజిక ఉద్యమ నేతగా, ప్రజావీరుడిగా పేరుగాంచిన పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు.ఈ నెల 22న నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని పరిగి పట్టణంలోని పండుగ సాయన్న విగ్రహ ప్రాంగణంలో జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రభుత్వం పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడాన్ని నాయకులు స్వాగతించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండుగ సాయన్న ఆశయాలు, ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అక్టోబర్ 22న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న జయంతి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సంఘాల నాయకులు, బహుజనులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అదేవిధంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో పండుగ సాయన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ముకుంద నాగేశ్వర్, హనుమంతు ముదిరాజ్, పరిగి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దోమ శ్రీశైలం ముదిరాజ్, జిల్లా కార్యదర్శి దేశమోని మాణిక్యం ముదిరాజ్, నియోజకవర్గ అధ్యక్షుడు రామస్వామి ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ ముదిరాజ్,
మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటయ్య ముదిరాజ్, జర్నలిస్టు ఆంజనేయులు ముదిరాజ్, బిచ్చన్న ముదిరాజ్, ఆనంద్ గౌడ్, ప్రకాష్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, నారాయణ ముదిరాజ్, ఆకుల సత్యనారాయణ ముదిరాజ్, దోమ ప్రవీణ్ ముదిరాజ్, దోమ శ్రీనివాస్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




